BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 22 April 2026, 12:39 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Apr, 2026 - 12:39 PM
119 వీక్షణలు

కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి 

50 లక్షల మంది షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేసే కార్మిక వర్గానికి 15సం॥ నుంచి జీతాలు పెరుగుదల లేదు.!

రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల జీతాలు పెంచం.! జీవితాంతం పనిచేసినా పర్మినెంట్ చేయము,పెన్షన్ ఇవ్వం! ఉన్న జీతాలు తగ్గిస్తాం! ఉద్యోగ భద్రత లేకుండా బానిసల్లాగ పనిచేయించాలనే విధానాన్ని అనుసరిస్తుంది.

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దాం 

మహాసభల కరపత్రాలు విడుదల చేసిన ఏఐటీయూసీ నాయకులు 

కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ,50 లక్షల మంది షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేసే కార్మిక వర్గానికి 15సం॥ నుంచి జీతాలు పెరుగుదల లేదని,రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల జీతాలు పెంచం.! జీవితాంతం పనిచేసినా పర్మినెంట్ చేయము,పెన్షన్ ఇవ్వం! ఉన్న జీతాలు తగ్గిస్తాం! ఉద్యోగ భద్రత లేకుండా బానిసల్లాగ పనిచేయించాలనే విధానాన్ని అనుసరిస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆరోపించారు 

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దామని బుధవారం పుంగనూరు సివిల్ సప్లయిస్ పాయింట్ వద్ద మహసభల కరపత్రాలు ఏఐటీయూసీ నాయకులు విడుదల చేశారు 

ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ నేడు కార్మిక వర్గం ఎన్నడూ లేనివిధంగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని,కార్మికుల కష్టాలను లోతుగా చర్చించి భవిష్యత్‌ కర్తవ్యాలను రూపొందించడానికి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 26 నుంచి 28 వరకు తిరుపతి లో జరుగుతున్నాయన్నారు 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గంపై తీవ్రమైన దాడిని కొనసాగిస్తున్నాయి. లేబర్‌కోడ్స్‌ పేరుతో కార్మికవర్గం వందేళ్ల కిందట సాధించుకున్న హక్కులన్నింటిని కాలరాస్తున్నాయని,కార్మికవర్గాన్ని కట్టు బానిసలుగా మార్చి కార్పొరేట్లకు అధిక లాభాలు చేకూరుస్తున్నాయని,కేంద్ర ప్రభుత్వం శ్రమశక్తి నీతి-2005 అనే డాక్యుమెంటును విడుదల చేసిందన్నారు .దీని ద్వారా ‘శ్రమ చేయడమే    కార్మికుల బాధ్యత.    ప్రతిఫలం    ఆశించరాదు’    అనే కర్మ సిద్ధాంతాన్ని తమ నినాదంగా ప్రకటించిందని తెలిపారు. 

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, డైలీ వేజ్‌, పీస్‌ రేటు తదితర రేట్ల పేరుతో కార్మికవర్గాన్ని కార్పొరేట్లు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌.జి.వో లు, టీచర్లతో సహా అందరూ పి.ఆర్‌.సి. కోసం పడిగాపులు పడుతున్నారని  తెలిపారు .

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పుంగనూరు నియోజకవర్గ కార్యదర్శి వెంకటరమణ రెడ్డి, సీపీఐ పుంగనూరు పట్టణ కార్యదర్శి రాంమూర్తి, హమాలీ వర్కర్స్ రెడ్డప్ప,పళణి,తిరుమలయ్,వీర మణి, విజయ్, గంగాధర్, బాలాజీ,సదాశివ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు