BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 11 September 2026, 09:08 pm
Posted by : BALAKRISHNA BANDI

బెస్ట్‌పల్లిలో ఘనంగా కావమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
11 Sep, 2026 - 09:08 PM
4 వీక్షణలు

వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. మహిళల కోలాటాలు, భజనలతో ఆధ్యాత్మిక సందడి

రొంపిచర్ల | Ntoday News

చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం మొట్టమల్లెల గ్రామపంచాయతీ పరిధిలోని బెస్ట్‌పల్లి గ్రామంలో కావమ్మ మందిరం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి శ్లోకాలు, భజనలు, కోలాటాలతో భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

ఈ కార్యక్రమానికి స్థానిక నాయకుడు సుందరం ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు సుందరం కుటుంబ సభ్యులు అన్నదానం అందించారు.

కావమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.