BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 19 July 2026, 09:11 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేజ్ వీల్స్‌తో రోడ్లపై ట్రాక్టర్లకు నో ఎంట్రీ: డీటీఓ హెచ్చరిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 09:11 AM
124 వీక్షణలు

కేజ్ వీల్స్‌తో రోడ్లపై ట్రాక్టర్లకు నో ఎంట్రీ: డీటీఓ హెచ్చరిక

మహబూబాబాద్, జూలై 19: వ్యవసాయ ట్రాక్టర్లకు అమర్చే కేజ్ వీల్స్‌తో ప్రజా రహదారులపై ప్రయాణిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తామని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ హెచ్చరించారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేజ్ వీల్స్‌ను వ్యవసాయ పనుల కోసం పొలాల్లో మాత్రమే ఉపయోగించాలని, రహదారులపై ప్రయాణించే ముందు వాటిని తొలగించి సాధారణ రబ్బరు టైర్లను అమర్చుకోవాలని సూచించారు.

వ్యవసాయ భూముల్లో బురద నేలల్లో ట్రాక్టర్‌కు మెరుగైన పట్టును కల్పించేందుకు కేజ్ వీల్స్ ఉపయోగపడతాయని, అయితే వాటితో బీటీ, సీసీ, గ్రామీణ రహదారులపై ప్రయాణించడం వల్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. దీంతో గుంతలు ఏర్పడి ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారులు త్వరగా ధ్వంసమవడంతో పాటు ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

రైతులు ఇంటి నుంచి పొలానికి వెళ్లేటప్పుడు కేజ్ వీల్స్‌ను ట్రాక్టర్ ట్రైలర్‌లో తీసుకెళ్లి, పొలం వద్ద మాత్రమే అమర్చుకోవాలని సూచించారు. పనులు పూర్తయిన తర్వాత వాటిని తొలగించి రబ్బరు టైర్లను అమర్చుకుని తిరిగి రహదారులపై ప్రయాణించాలని తెలిపారు.

ప్రజా ఆస్తులను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రహదారుల సంరక్షణ ద్వారా ప్రభుత్వానికి నష్టం తగ్గించడంతో పాటు ప్రమాదాలను కూడా నివారించవచ్చని శంకర్ నాయక్ పేర్కొన్నారు. జిల్లాలో ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రైతులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.