BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 25 July 2026, 08:31 am
Posted by : కూనురు మధు

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్.. విద్యాసంస్థల బంద్ విజయవంతం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Jul, 2026 - 08:31 AM
140 వీక్షణలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్.. విద్యాసంస్థల బంద్ విజయవంతం

​నకిరేకల్: నీట్  పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్‌టీఏ  సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ  ఆధ్వర్యంలో శుక్రవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.

​ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి వడ్డగోని మహేష్, ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీల వల్ల గడిచిన కొన్నేళ్లలో 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లడఖ్ హక్కుల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాస్త్రవేత్త సోనమ్ వాంగ్‌చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్, టీర్ గ్యాస్ ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు.

​ఈ కార్యక్రమంలో ఎల్డిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బడే అజయ్, నాయకులు జిట్టా సురేష్, జిట్టా దినేష్, జిట్టా హరీష్, గోలి అరుణ్, చంటి, మనోహర్, విన్ను, యశ్వంత్, కార్తీక్, విఘ్నేష్ మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.