BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 August 2026, 08:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేవీపల్లిలో 77 గ్రాముల బంగారు నగల చోరీ కేసు ఛేదన.. ముగ్గురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 08:10 AM
59 వీక్షణలు

కేవీపల్లిలో 77 గ్రాముల బంగారు నగల చోరీ కేసు ఛేదన.. ముగ్గురు అరెస్ట్

అన్నమయ్య జిల్లా కేవీపల్లి: ఇంట్లో చోరీకి గురైన 77 గ్రాముల బంగారు నగల కేసును కేవీపల్లి పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కేవీపల్లి మండలం లక్ష్మిరెడ్డిగారిపల్లికి చెందిన నాజర్‌ భాష ఇంట్లో ఈ నెల 17న 77 గ్రాముల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితుడు కేవీపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా నాజర్‌ భాష ఇంటికి తరచూ వచ్చి వెళ్తున్న అదే గ్రామానికి చెందిన అప్సానా (19)పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను విచారించగా బంగారు నగలు చోరీ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

చోరీ చేసిన నగలను పీలేరులోని కాటువకాలవ వీధిలో నివాసం ఉంటున్న ఖాజా (23), సలీమా (30) వద్ద ఉంచినట్లు విచారణలో వెల్లడైంది. వీరిలో ఇద్దరు నిందితులు 40 గ్రాముల బంగారాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టగా, మిగిలిన 33.8 గ్రాముల బంగారాన్ని తమ వద్ద ఉంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ముగ్గురు నిందితులను శుక్రవారం ఉదయం వగల్లు బస్టాండ్‌ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు మహిళా నిందితులను చిత్తూరు సబ్‌జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.