BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 27 June 2026, 11:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కడియం నర్సరీల్లో కలకలం రేపుతున్న ‘యాసిడ్ పురుగులు’.. కూలీలపై దాడులతో ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
136 వీక్షణలు

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో ఓ వింత పురుగు రైతులు, కూలీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కడియం నర్సరీల్లో గత రెండు నెలలుగా కనిపిస్తున్న ఈ పురుగులు ఇటీవల లక్షల సంఖ్యలో వ్యాపించి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

నర్సరీల్లో పనిచేస్తున్న కూలీలపై ఈ పురుగులు దాడి చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పురుగు శరీరంపై పాకిన ప్రాంతాల్లో పెద్దపెద్ద బొబ్బలు ఏర్పడి, అగ్నిమంటల మాదిరిగా మంట, దురద వస్తోందని బాధితులు చెబుతున్నారు. ఈ బొబ్బలు దాదాపు 20 రోజుల వరకు తగ్గడం లేదని వాపోతున్నారు.

రోజువారీ కూలి పనులపైనే జీవనం సాగించే కార్మికులు పనికి వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కరోజు పని చేయకపోయినా కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక కూలీలు నర్సరీలకు రావడానికి వెనుకాడటంతో నర్సరీ రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వింత ‘యాసిడ్ పురుగుల’ను నియంత్రించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రైతులు, కూలీలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.