BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 26 May 2026, 08:44 am
Posted by : కూనురు మధు

కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 May, 2026 - 08:44 AM
199 వీక్షణలు

కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం కిశోర బాలికలకు, గర్భవతులకు ఉచిత ఆరోగ్య, రక్త పరీక్షలు నిర్వహించారు. ఐసీడీఎస్ ఏసీడీపీఓ వెంకటమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ పోషకాలు గల ఆహార పదార్థాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ​ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. పిల్లల ఎదుగుదలకు ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం, బాలామృతం ప్లస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం, యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ టి. నర్సింగరావు, పీహెచ్ఎన్ జోషి కుమార్, ఎల్‌టీ సుధాకర్, సీఈఓ సుధాకర్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సునీత, టీచర్లు దాడి అరుణ, ఎన్. అపర్ణ, శోభారాణి, బుజ్జమ్మ, కృష్ణవేణి, మమత, లలిత, జ్యోతి, సునీత, సుజాత, నాగమణి, కిశోర బాలికలు, గర్భవతులు పాల్గొన్నారు.