BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 10 July 2026, 11:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 11:56 AM
287 వీక్షణలు

గంపలగూడెం, జూలై 10: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఇటీవల మరణించిన ప్రధానోపాధ్యాయులు యన్నం రంగారెడ్డి జ్ఞాపకార్థం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, దాతలు అందించిన సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, కీర్తిశేషులు యన్నం రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా సేవలందించి మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. వారి జ్ఞాపకార్థం శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సంతాప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆర్గనైజర్ తోట నాగరాజు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.