BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 May, 2026 - 08:47 PM
101 వీక్షణలు

కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి!

ఎదురొచ్చే LED లైట్లతో వాహనదారుల విలవిల

హైబీమ్‌ల దాడితో ప్రమాదాల బారిన ప్రజలు

సగం బ్లాక్ స్టిక్కర్ రూల్ ఎక్కడ?.. అధికారులు నిద్రలోనా?

రాత్రి 7 గంటలు దాటితే చాలు... రోడ్డు మీదకు వాహనం తీసుకెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాల LED లైట్ల దాడితో కళ్ల ముందు ఒక్కసారిగా తెల్లటి వెలుగు పరచుకుని, కొన్ని క్షణాలు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంటోంది. “రోడ్డు మీద ప్రయాణమా.. లేక ప్రాణాలతో ఆటా?” అని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న కొత్త వాహనాలన్నీ అధిక పవర్ LED లైట్లతో రోడ్లపైకి వస్తుండగా, వాటిపై నియంత్రణ మాత్రం పూర్తిగా గాలికొదిలేశారు. ముఖ్యంగా హైబీమ్ లైట్లు ఎదురుగా పడితే ద్విచక్ర వాహనదారుల పరిస్థితి దారుణంగా మారుతోంది. కళ్లలో మంట, చూపు మసకబారడం, రోడ్డు కనిపించక వాహనాలు అదుపు తప్పడం వంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఒకప్పుడు వాహనాల హెడ్‌లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ తప్పనిసరి అనే నిబంధన ఉండేది. దాంతో ఎదురుగా వచ్చే కాంతి తీవ్రత కొంతవరకు తగ్గేది. ఇప్పుడు ఆ రూల్‌ను ఎత్తేశారా?.. లేక అధికారులు మర్చిపోయారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

“LED లైట్లు కాదు... ఇవి చిన్న సూర్యుల్లా మారిపోయాయి” అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ రహదారులు, హైవేలపై రాత్రి ప్రయాణం నరకయాతనగా మారిందని వాపోతున్నారు.

ఇప్పటికైనా రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు కళ్లు తెరవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధిక ప్రకాశం ఉన్న LED లైట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని, హైబీమ్ దుర్వినియోగంపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

అలాగే పాత నిబంధనలను పునరుద్ధరించి, హెడ్‌లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ తప్పనిసరి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే “రాత్రి ప్రయాణం అంటే ప్రమాదానికి ఆహ్వానం” అన్న పరిస్థితి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.