BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 04:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంభంపాడులో కౌలు రైతు సంఘం ధర్నా....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:38 PM
78 వీక్షణలు

కంభంపాడులో కౌలు రైతు సంఘం ధర్నా.. కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు సహకార సంఘం సొసైటీ వద్ద ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు.

ఎన్నికల ముందు కౌలు రైతులను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని కౌలు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. కౌలు రైతులకు పంట రుణాలు అందించాలని, వ్యవసాయ పెట్టుబడులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

కౌలు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కౌలు రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. ధర్నాలో పలువురు రైతులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.