BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 10 August 2026, 10:59 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంటతడి పెట్టుకున్న కేసీఆర్.. పెద్ది కుటుంబాన్ని చూసి భావోద్వేగం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 10:59 AM
92 వీక్షణలు

కంటతడి పెట్టుకున్న కేసీఆర్.. పెద్ది కుటుంబాన్ని చూసి భావోద్వేగం

నల్లబెల్లి: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కార్యక్రమానికి హాజరైన కేసీఆర్.. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం పెద్ది కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సమయంలో పెద్ది సుదర్శన్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కేసీఆర్ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. ఆప్తుడిని కోల్పోయిన బాధను తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి తనతో కలిసి పనిచేశారని కేసీఆర్ పలుమార్లు గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో పనిచేసిన పెద్ది అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

కుటుంబానికి అండగా ఉంటాం

ఇంటి పెద్దను కోల్పోయిన పెద్ది కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. పిల్లల చదువులు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమ బాధ్యతలను పార్టీ తరఫున పర్యవేక్షిస్తామని తెలిపారు.

కాగా, పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. ఆయన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చెరో రూ.కోటి చొప్పున, తల్లి అమృతమ్మ సంక్షేమం కోసం రూ.25 లక్షలు కేటాయించినట్లు సమాచారం.

కేసీఆర్ పరామర్శకు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులు తరలివచ్చారు. నల్లబెల్లిలోని పెద్ది నివాసం వద్ద విషాద వాతావరణం నెలకొంది.