BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 24 March 2026, 05:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండ నాలుకకు మందు వేస్తే… ఉన్న నాలుక ఊడినట్టు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 05:46 PM
185 వీక్షణలు

కొండ నాలుకకు మందు వేస్తే… ఉన్న నాలుక ఊడినట్టు!

అవగాహన లోపం, నిర్లక్ష్యం రైతుకు ఎంతటి నష్టాన్ని మిగులుస్తుందో మరోసారి బట్టబయలైంది. గుట్టపాలెం గ్రామానికి చెందిన రైతు గంగిరెడ్డి తీవ్రంగా నష్టపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

బెంగళూరు రోడ్డులోని ఎం.వి.ఆర్ సీడ్స్ & ఫర్టిలైజర్ షాప్‌కు వెళ్లిన గంగిరెడ్డి, తన ఒక ఎకరా టమోటా పంట ఎదుగుదలకు సరైన మందులు ఇవ్వాలని కోరాడు. దుకాణ యజమాని సూచించిన మందులను లీటర్‌కు ₹1400 చొప్పున కొనుగోలు చేసి పంటపై ఉపయోగించాడు.

అయితే, పంట ఎదుగుదల కోసం ఇవ్వాల్సిన మందుల బదులు పంటను కాల్చే రసాయనాలు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పచ్చగా వున్న టమోటా పంట పూర్తిగా ఎండిపోయి రైతు తీవ్ర నష్టాన్ని చవిచూశాడు.

ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదని, గతంలో కూడా ఇదే దుకాణం వల్ల పలువురు రైతులు ఇబ్బందులు పడినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

రైతుల డిమాండ్:

దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందించాలని రైతులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.