కూలిపోయిందని దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రైతులకు సాగునీరు..!
కూలిపోయిందని దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రైతులకు సాగునీరు..!
తెలంగాణలో ఒకప్పుడు "కూలిపోయింది", "వృథా ప్రాజెక్టు" అంటూ విమర్శలు ఎదుర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే ప్రస్తుతం రైతులకు సాగునీరు అందుతోంది. గతంలో కాళేశ్వరం రివర్స్ పంపింగ్ విధానాన్ని తీవ్రంగా విమర్శించిన ప్రభుత్వమే ఇప్పుడు అదే పద్ధతిని అమలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
SRSP వరద కాలువలోని రాంపూర్ పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి, కాళేశ్వరం పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ విధానంలో ఎత్తిపోస్తున్నారు. ఈ నీటిని SRSP వరద కాలువకు తరలించడం ద్వారా సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.
గతంలో ఈ విధానాన్ని వ్యతిరేకించినవారే ఇప్పుడు రైతుల ప్రయోజనాల కోసం అదే సాంకేతికతను వినియోగించడం గమనార్హమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం, సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది. రైతులకు నీటి సరఫరా కొనసాగుతుండటంతో సాగు పనులు ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.