BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 21 June 2026, 09:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోటపాడులో కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 09:34 PM
201 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం కోటపాడు గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. నూజివీడు డీఎస్పీ కెవీవీఎన్వీ ప్రసాద్, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐవి నాగేంద్ర కుమార్ ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు.

దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 4 కోడి పుంజులు, 2 కోడి కత్తులు, రూ.4,400 నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. రామకృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజలను ఆర్థికంగా నష్టపరిచే జూద క్రీడలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. జూదాన్ని ప్రోత్సహించే వారు లేదా పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూద కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్-112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.