BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 05:38 pm
Posted by : DAVU RAVINDER REDDY

కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం.. సర్టిఫికెట్లు లేకున్నా దరఖాస్తు

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
04 Sep, 2026 - 05:38 PM
8 వీక్షణలు

తెలంగాణ: కొత్త పెన్షన్ల దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోయినా కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు సెర్ఫ్ తెలిపింది.

దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు తదితర అర్హత కలిగిన లబ్ధిదారులకు రెవెన్యూ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

సర్టిఫికెట్లు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే దరఖాస్తుల పరిశీలన సమయంలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని సెర్ఫ్ సూచించింది. అర్హత కలిగిన వారు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు.

కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2026.