BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 10:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కరెంట్ పోయిందా? ఇక వాట్సప్‌లోనే ఫిర్యాదు..

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 10:28 PM
134 వీక్షణలు

కరెంట్ పోయిందా? ఇక వాట్సప్‌లోనే ఫిర్యాదు.. తెలంగాణ విద్యుత్ శాఖ సరికొత్త సేవలు

హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. కరెంట్ కోతలు, లో-వోల్టేజ్, ట్రాన్స్‌ఫార్మర్ లోపాలు, విద్యుత్ సరఫరా అంతరాయాల వంటి సమస్యలను ఇక నుంచి నేరుగా వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తూ టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDSL) సరికొత్త సేవలను ప్రారంభించింది.

వినియోగదారుల సౌకర్యార్థం ప్రాంతాల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా సంబంధిత లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, సహాయ ఇంజనీర్ (ఏఈ)లను నేరుగా సంప్రదించి విద్యుత్ సమస్యలను వెంటనే తెలియజేయవచ్చు. దీంతో ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగ్గి, వేగంగా స్పందించే అవకాశం ఏర్పడనుంది.

ఇప్పటివరకు విద్యుత్ సమస్యల కోసం వినియోగదారులు ప్రధానంగా 1912 కాల్ సెంటర్‌పై ఆధారపడేవారు. అయితే కొత్త వాట్సప్ సేవలతో ఫిర్యాదులను మరింత వేగంగా స్వీకరించి, తక్షణ చర్యలు తీసుకోవడమే విద్యుత్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కొత్త విధానం అమల్లోకి రావడంతో విద్యుత్ కోతలు, మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ లోపాలు, లో-వోల్టేజ్ వంటి సమస్యల పరిష్కారం మరింత సులభం కానుందని అధికారులు తెలిపారు. వినియోగదారులు తమ ప్రాంతానికి సంబంధించిన వాట్సప్ గ్రూపులో చేరి అవసరమైనప్పుడు నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.