BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 23 June 2026, 06:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కృష్ణలంకలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం.. తండ్రి, కుమారుడిపై దారుణ దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 06:24 AM
127 వీక్షణలు

విజయవాడ కృష్ణలంకలో సోమవారం రాత్రి బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. కరకట్టపై శిశుభవన్ సమీపంలో తండ్రి, కుమారుడిపై దుండగులు బ్లేడ్‌లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

స్థానికుల వివరాల ప్రకారం కృష్ణలంకకు చెందిన భాను, ఆయన కుమారుడిపై చెక్క కుమార్ అనే వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, బాలుడి గొంతు భాగంలో తీవ్రమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గాయపడిన వారిని తొలుత కృష్ణలంకలోని శ్రీరామ్ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

దుండగులు గంజాయి మత్తులో ఈ దాడికి పాల్పడ్డారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. కరకట్ట పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు, నిందితుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.