BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 May 2026, 09:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 09:10 PM
147 వీక్షణలు

కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర @598 మార్కులు – తల్లి కష్టానికి ప్రతిఫలం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు ఎస్సీ కాలనీకి చెందిన పెయ్యిల పవిత్ర పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ దక్కించుకుంది. కష్టాల మధ్య వెలిగిన ఈ విజయం ఇప్పుడు గ్రామం మొత్తం గర్వంగా చెప్పుకుంటున్న కథగా మారింది.

తల్లిదండ్రుల మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా చిన్న వయసులోనే కుటుంబం విడిపోయింది. ఆ తర్వాత తల్లి మాధవి ఒక్కరే కష్టాల బరువు మోస్తూ, నర్సింగ్ చదివి రాజమహేంద్రవరం నర్సింగ్ కాలేజీలో ఉద్యోగం చేస్తూ కూతురి భవిష్యత్తే లక్ష్యంగా జీవనం సాగించారు. చదువు విలువ తెలుసుకున్న తల్లి పవిత్రను మొదట ఆలమూరు సిద్ధార్థ స్కూల్లో చేర్పించి, తరువాత నాలుగవ తరగతి నుంచి తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్లో చదివించారు.

తల్లి పడుతున్న కష్టాలను చిన్నప్పటి నుంచే గమనించిన పవిత్ర, ఆటపాటలకు దూరంగా పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టి నిరంతర శ్రమతో ఈ అద్భుత ఫలితాన్ని సాధించింది. రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ రావడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, బంధువులు పవిత్రను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

ఇంతటితో ఆగకుండా పవిత్ర జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించే “శ్రేష్ట” ప్రవేశ పరీక్షలో ఆలిండియా 255వ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంక్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు వంద ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత విద్య పొందే అవకాశం లభిస్తుంది. మన రాష్ట్రం నుంచి 25 మంది మాత్రమే ఈ అవకాశానికి ఎంపిక కావడం గమనార్హం.

ఇంటర్మీడియట్‌లో బైపీసీ తీసుకుని భవిష్యత్తులో డాక్టర్ కావడమే తన లక్ష్యమని పవిత్ర స్పష్టం చేసింది. కష్టాలను ఎదుర్కొని సాధించిన ఈ విజయంతో పవిత్ర ఇప్పుడు ఎందరో విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది.

తల్లి త్యాగం, కూతురి పట్టుదల కలిసిన చోట విజయానికి హద్దులు లేవని పవిత్ర మరోసారి నిరూపించింది.