BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

కులగణనపై సుప్రీంకోర్టు తీర్పుకు బీసీ సమాజ్ హర్షం.. కేంద్రానికి కీలక డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 May, 2026 - 02:33 PM
174 వీక్షణలు

కులగణన వ్యతిరేకులకు ఈ తీర్పు చెంపపెట్టు: నరెడ్ల శ్రీనివాస

​కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాప్తంగా ఓబీసీ లెక్కింపు చేపట్టాలని డిమాండ్

 జనగణనలో బీసీ కులగణన చేపట్టవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని, ఇది కులగణన వ్యతిరేకులకు చెంపపెట్టు లాంటిదని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కాలని ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాట ఫలితమే ఈ తీర్పు అని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి, ప్రభుత్వాలు సరైన సంక్షేమ విధానాలు రూపొందించడానికి కులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలు అత్యంత అవసరమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడాన్ని ఆయన స్వాగతించారు.

​వెనుకబడిన వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలంటే సమగ్ర కులగణన తప్పనిసరి అని నరెడ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో కులగణన చేస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూసిందని విమర్శించిన ఆయన, ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న కుటుంబాల లెక్కింపు ప్రక్రియలోనే బీసీ కుటుంబాల వివరాలను కూడా నమోదు చేసేలా తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. బీసీ జనాభా లెక్కలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించడం పట్ల ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు