BREAKING
thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
Date of Publish : 04 June 2026, 06:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కుమారుడిని చంపి.. మిస్సింగ్ అంటూ కోర్టుకెక్కిన తల్లి!

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 06:24 AM
193 వీక్షణలు

కర్నూలు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ తల్లి తన ప్రియుడితో కలిసి కన్న కుమారుడినే హత్య చేసి, అనంతరం అతడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక హైకోర్టును కూడా ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కౌతాళం మండలం బదినేహాలు గ్రామానికి చెందిన గంగమ్మకు, బంధువైన దర్గప్పతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తరచూ ఇంటికి వస్తున్న దర్గప్పను గంగమ్మ పెద్ద కుమారుడు వీరేశ్ (17) తీవ్రంగా వ్యతిరేకించడంతో, అతడిని అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ కుట్ర పన్నారు.

2024 నవంబరులో ఇంట్లోనే వీరేశ్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన నిందితులు, మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి బైక్‌పై తీసుకెళ్లి సమీప శ్మశానవాటికలో పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది.

అంతేకాక, తన కుమారుడు కనిపించడం లేదంటూ గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పురోగతి లేదంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది.

సిట్ విచారణలో అసలు నిజం బయటపడింది. గంగమ్మ, దర్గప్ప కలిసి వీరేశ్‌ను హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు, శ్మశానవాటికలో పాతిపెట్టిన అస్థిపంజరాన్ని వెలికితీశారు. అక్కడ లభించిన దుప్పటి, టవల్, తాడు వంటి వస్తువులను కుటుంబ సభ్యులు వీరేశ్‌వేనని గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

ఇదిలా ఉండగా, కేసు మలుపు తిరిగిన సమయంలోనే గంగమ్మ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం మరో సంచలనంగా మారింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, ఆమె మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.

వీరేశ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్గప్పను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తల్లి చేతిలోనే కుమారుడు బలైపోవడం, ఆ తర్వాత మిస్సింగ్ నాటకం ఆడి కోర్టు వరకు వెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.