BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ
Date of Publish : 19 July 2026, 10:03 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 10:03 AM
119 వీక్షణలు

ప్రప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి ఘనంగా నిర్వహణ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం లోని పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంగళ్ పాండే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, మంగళ్ పాండే 1827 జూలై 19న ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా నగ్వా గ్రామంలో జన్మించారని తెలిపారు. 1849లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరిన ఆయన, 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించి భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామానికి నాంది పలికారని వివరించారు.

బ్రిటిష్ పాలకులు తుపాకీ తూటాలపై ఆవు, పంది కొవ్వు పూత ఉండే కార్ట్రిడ్జ్‌లను నోటితో కొరికి ఉపయోగించాలని విధించిన విధానాన్ని మత విశ్వాసాలకు విరుద్ధమని భావించి మంగళ్ పాండే తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. ఆ నిరసనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి సాయుధ పోరాటానికి దారితీసిందని పేర్కొన్నారు.

బ్రిటిష్ ప్రభుత్వం మంగళ్ పాండేను అరెస్టు చేసి 1857 ఏప్రిల్ 8న ఉరిశిక్ష అమలు చేసిందని, ఆయన త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి తర్వాతి తరాల స్వాతంత్ర్య సమరయోధులైన నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తదితరులకు స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.