BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 19 July 2026, 09:12 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాలు కురవాలని పెనుగొలనులో చండీశ్వరుడికి అభిషేకం – నగర సంకీర్తన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 09:12 AM
200 వీక్షణలు

వర్షాలు కురవాలని పెనుగొలనులో చండీశ్వరుడికి అభిషేకం – నగర సంకీర్తన

జూలై 19: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆదివారం భక్తులు శివాలయం ప్రాంగణంలోని చండీశ్వరుడికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం మారేడు దళాలతో ప్రత్యేక పూజలు చేశారు.

చండీశ్వరుడిని ఆరాధించడం వల్ల భక్తులకు సకల కార్యసిద్ధి, శివానుగ్రహం లభిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు.

అంతకుముందు సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో శివాలయం నుంచి భగవన్నామ స్మరణతో నగర సంకీర్తన ప్రారంభమైంది. రేడియో రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా సాగిన సంకీర్తన షిరిడి సాయిబాబా మందిరానికి చేరుకుంది.

ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, సుగ్గల విష్ణు తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా, పెనుగొలను బొడ్రాయి సెంటర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహానికి శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసినట్లు నిర్వహణ కమిటీ సభ్యులు బొలగాలి నాగయ్య, కోట దాసు తెలిపారు.