BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 05 August 2026, 06:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

క్విట్ ఇండియా డే సందర్భంగా జైల్ భరో విజయవంతం చేయండి: ఏఐకేఎం పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 06:22 PM
118 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 9న దేశవ్యాప్తంగా నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐకేఎం రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లాల సమావేశం విస్సన్నపేటలో దుర్గం పుల్లారావు అధ్యక్షతన నిర్వహించారు.

సమావేశంలో హరినాథ్ మాట్లాడుతూ అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల భారత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు సీ2 + 50 శాతం కనీస మద్దతు ధర అమలు చేయాలని, నూతన విద్యుత్ చట్టం–2025ను రద్దు చేయాలని కోరారు.

అలాగే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, అసంఘటిత కార్మికులకు నెలకు రూ.36 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి తగిన సహాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

మెట్ట ప్రాంతానికి వరప్రదాయినిగా భావిస్తున్న చింతలపూడి ఫేజ్–2 ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని, కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసే ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్న రైతులకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ భూములకు సంబంధించిన నాలుగో నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేయాలని కోరారు.

"వ్యవసాయాన్ని – భూమిని – రైతును కాపాడుకుందాం" అంటూ పిలుపునిచ్చిన హరినాథ్, జైల్ భరో కార్యక్రమంలో రైతులు, కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, ఏఐసీసీటీయూ కార్యదర్శి వేముల బక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, కలపాల వెంకటేశ్వరరావు, భవాని, పీక లావతి, భూతం మారయ్య తదితరులు పాల్గొన్నారు.