BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 04 April 2026, 01:23 pm
Posted by : V శ్రీనివాస్

​క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్-సీపీఐ కూటమి కైవసం

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 01:23 PM
384 వీక్షణలు

​క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్-సీపీఐ కూటమి కైవసం

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి చెక్ పెడుతూ బీఆర్ఎస్, సీపీఐ కూటమి ఘనవిజయం సాధించింది. గతంలో మంత్రి వివేక్ మరియు కాంగ్రెస్ నేతల జోక్యం వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ఎన్నికల ప్రక్రియ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యూహాత్మక చొరవతో ముగియగా, మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గోడిశెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 10, సీపీఐ 4 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన బలంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా, కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 7 స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది