BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 15 May 2026, 03:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లైసెన్స్‌, అమెండ్మెంట్లు లేని డీలర్లపై కఠిన చర్యలు -విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:25 PM
160 వీక్షణలు

ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం కలగర గ్రామంలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా షాపుల్లో నిర్వహిస్తున్న స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించి, నూతనంగా సర్టిఫై చేశారు. పాత స్టాక్స్‌కు సంబంధించిన ఎంట్రీలు, విక్రయ రికార్డులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

డీలర్లందరూ తమ లైసెన్సులు, ఓ-ఫారమ్‌లు, ఇతర అవసరమైన అమెండ్మెంట్లు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఆమె ఆదేశించారు. లైసెన్స్‌ లేదా అమెండ్మెంట్లు లేకుండా ఎరువులు, పురుగుమందులు, విత్తనాల విక్రయాలు నిర్వహిస్తే సంబంధిత డీలర్లపై ఎరువులు, పురుగుమందులు మరియు విత్తనాల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందేలా అధికారులు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తారని మండల వ్యవసాయాధికారి తెలిపారు.