BREAKING
thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు
Date of Publish : 18 August 2026, 01:59 pm
Posted by : కూనురు మధు

లెక్చరర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు : కళాశాల ఎదుట ఆందోళన

తెలంగాణ
/ నల్గొండ / దేవరకొండ
18 Aug, 2026 - 01:59 PM
147 వీక్షణలు

లెక్చరర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు : కళాశాల ఎదుట ఆందోళన

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఓ లెక్చరర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం దేవరకొండలో కలకలం రేపింది. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న భాస్కర్ ఓ విద్యార్థినిని కొంతకాలంగా అసభ్యకరంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

బాధిత విద్యార్థిని ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థినుల దృష్టికి తీసుకెళ్లడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో కళాశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట బైఠాయించి లెక్చరర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయంలో ఉన్న లెక్చరర్ భాస్కర్‌ను కొందరు ఆందోళనకారులు పట్టుకుని దాడి చేసినట్లు సమాచారం. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

విద్యార్థినుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజాలు తేలితే బాధ్యుడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కళాశాలల్లో విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.