లక్కారం వద్ద పశువుల అక్రమ రవాణా భగ్నం
లక్కారం వద్ద పశువుల అక్రమ రవాణా భగ్నం
బజరంగ్ దళ్ కార్యకర్తల సహకారంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌లోని బహదూర్‌పూర్‌కు అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని చౌటుప్పల్ మండలం లక్కారం సమీపంలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు బుధవారం రాత్రి అడ్డుకున్నారు. వాహనంలో 21 కోడెలు (నందిమహారాజులు), 8 ఆవులు ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. అనంతరం పశువులను సురక్షిత ప్రాంతానికి (గోశాలకు) తరలించి, రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బజరంగ్‌దళ్ జిల్లా కో–కన్వీనర్ గోగు రవి మాట్లాడుతూ గోవులను, పశువులను చట్టవిరుద్ధంగా తరలించే ముఠాలపై పోలీసులు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల నుండి అక్రమ రవాణా జరగకుండా అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.