BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 13 June 2026, 07:59 pm
Posted by : V శ్రీనివాస్

​లక్షెట్టిపేట కేజీబీవీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Jun, 2026 - 07:59 PM
171 వీక్షణలు

లక్షెట్టిపేట / మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన లక్షెట్టిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించి.. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ, విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్, ప్రహరీ గోడ, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతుల కల్పనకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

​ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు (యూనిఫాం) అందజేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు