BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 May 2026, 12:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్!

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 12:40 PM
138 వీక్షణలు

గాజువాక నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థుల సత్తా… జిల్లా దృష్టిని ఆకర్షించిన ఫలితాలు! 

విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలోని నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈసారి పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. 592 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో టాప్ స్కోర్ నమోదు చేయడంతో పాటు, పలు మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.

లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూళ్లకు గట్టి పోటీ ఇస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదే స్థాయిలో రాణించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఒకటి రెండు ర్యాంకులకే పరిమితం కాకుండా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది.

ఈ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఆనందోత్సవాలు నిర్వహించారు. డప్పులు, ఊరేగింపుతో పాఠశాల పరిసరాలు ఉత్సాహభరితంగా మారాయి.

ఉచిత విద్యతో పాటు మెరుగైన బోధన అందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట వేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు మరోసారి తమ సత్తా చాటాయి. ప్రభుత్వ విద్యపై ఉన్న అపోహలకు ఈ ఫలితాలు గట్టి సమాధానంగా నిలిచాయి.