BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 28 June 2026, 12:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Health: లక్ష్మీపురంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం.. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 12:07 PM
214 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా | తిరువూరు మండలం | జూన్ 29 | NTODAY NEWS

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆర్డీఓ ఏ. కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ ఏ. కుమార్ మాట్లాడుతూ, పోలియో నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.

అక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు పల్స్ పోలియో చుక్కల ప్రాముఖ్యతను వివరించి, నిర్దేశించిన తేదీల్లో పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కలు పిల్లలను జీవితాంతం పోలియో వ్యాధి బారి నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గ్రామస్థులు కూడా సహకరించారు