BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 10 August 2026, 12:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత సుందరాచారి జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 12:31 PM
105 వీక్షణలు

మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత సుందరాచారి జయంతి వేడుకలు

తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన సాహితీ ప్రస్థానం, తెలుగు భాషకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

సభలో విశ్రాంత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేమవరపు హనుమంతరావు మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచారి 1914 ఆగస్టు 10న తిరుపతిలో రాజగోపాలచారి, కమలమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. చిన్ననాటి నుంచే తెలుగు సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న సుందరాచారి అనేక వ్యాసాలు, కవితలు రచించారని వివరించారు.

తిరుపతిలోనే బాల్యాన్ని గడిపిన సుందరాచారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేసిన అనంతరం మదనపల్లెలోని బెసెంట్ కళాశాలలో ఇంటర్మీడియట్‌ను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. జీవనోపాధి కోసం తిరుపతిలో హోటల్ సర్వర్‌గా, రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేయడంతో పాటు ఆంధ్రపత్రికలో అచ్చుదోషాలు సరిచేసే పనిని, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారని తెలిపారు.

విశ్రాంత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కపిలవాయి లక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రపత్రికలో ‘కళావని’ శీర్షికతో సుందరాచారి రాసిన వ్యాసాలు ఆయనను సాహిత్య ప్రపంచానికి పరిచయం చేశాయని తెలిపారు. అనంతరం ఆయన ‘నాస్వామి’, ‘గీతాంజలి’ వంటి కావ్య రచనలు, ‘కెరటాలు’, ‘సుందర సుధాబిందువులు’ వంటి ఖండకృతులు, ‘గాలిమేడలు’, ‘అరాచకం’ వంటి దృశ్యకృతులు, ‘బుద్ధగీత’, ‘ఏకలవ్యుడు’ వంటి ప్రబోధ రచనలు, ‘శాంతిదూతలు’, ‘రంగిరాస్యం’ వంటి జానపద రచనలు చేశారని వివరించారు.

1942లో ‘దీనబంధు’ సినిమా కోసం సుందరాచారి ‘మా తెలుగు తల్లికి’ గీతాన్ని రచించారని తెలిపారు. అయితే ఈ పాట యుగళగీతానికి సరిపోదనే కారణంతో నిర్మాత దానిని సినిమాలో చేర్చలేదని చెప్పారు. అనంతరం గ్రామ్‌ఫోన్ రికార్డు కోసం టంగుటూరి సూర్యకుమారి ఈ గీతాన్ని ఆలపించడంతో పాటకు విశేష గుర్తింపు లభించిందని వివరించారు.

1975 ఏప్రిల్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు, విద్యా సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా మండలి వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో తొలి ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించారని గుర్తుచేశారు. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు భాషాభిమానులు ఈ మహాసభలకు హాజరయ్యారని తెలిపారు.

ఈ మహాసభల ప్రారంభ కార్యక్రమంలో టంగుటూరి సూర్యకుమారిని లండన్ నుంచి ఆహ్వానించి ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని ప్రార్థనా గీతంగా ఆలపింపజేశారని చెప్పారు. అయితే ఆ గీత రచయిత శంకరంబాడి సుందరాచారికి ఆహ్వానం లేకపోవడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సుందరాచారి మహాసభలకు హాజరయ్యారని, ప్రవేశద్వారం వద్ద అనుమతి లభించకపోవడంతో తన ఆవేదనను వ్యక్తం చేశారని తెలిపారు. ఈ విషయం అప్పటి మంత్రి మండలి వెంకట కృష్ణారావు దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే ప్రవేశద్వారం వద్దకు వచ్చి సుందరాచారిని సాదరంగా వేదికపైకి తీసుకెళ్లి సభకు పరిచయం చేశారని వివరించారు.

‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతంలో తెలుగు తల్లికి మల్లెపూల దండను సమర్పిస్తూ ఆమె ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని సుందరాచారి అద్భుతంగా వర్ణించారని వక్తలు పేర్కొన్నారు. తెలుగు తల్లి కడుపులోని సంపదను, ఆమె చూపుల్లోని కరుణను కవితాత్మకంగా ఆవిష్కరించిన ఈ గీతం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు.

అంగన్వాడి ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ మాట్లాడుతూ సుందరాచారికి ‘ప్రసన్న కవి’, ‘సుందర కవి’ అనే బిరుదులు కూడా ఉన్నాయని తెలిపారు. తెలుగు ప్రజలకు రాష్ట్ర గీతాన్ని అందించిన మహాకవిని ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం చిన్నారులు, మహిళలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది, మహిళా కమిటీ సభ్యులు, అంగన్వాడి చిన్నారులు పాల్గొన్నారు.