BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 04 April 2026, 07:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మల్లేలలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:33 AM
170 వీక్షణలు

మల్లేలలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మల్లేల గ్రామంలోని పరిశుద్ధ పౌలు సీఎస్ఐ దేవాలయంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.

సంఘం సభ్యులంతా పాల్గొని, సర్వ మానవాళి పాప పరిహారార్థం, మానవుల రక్షణ కొరకు సిలువపై తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సిలువను మోసుకుంటూ గ్రామంలోని ప్రధాన వీధులలో ప్రదర్శనగా తీసుకెళ్లుతూ, ఆయన పాపుల కొరకు చేసిన త్యాగాన్ని వివరిస్తూ సిలువ మార్గం నిర్వహించారు.

తదనంతరం దేవాలయంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో స్థానిక గురువులు రెవరెండ్ గంటా రాకేష్ దేవ్ వాక్యోపదేశం చేశారు. అలాగే రెవరెండ్ దేవానందం ప్రార్థనలు నిర్వహించారు.

గ్రేస్ అమ్మ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలు ధ్యానిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, సంఘస్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సండే స్కూల్ పిల్లలు, మహిళల మైత్రి సభ్యులు, యువజనులు, పెద్దలు, చర్చి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.