BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం: అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:38 PM
67 వీక్షణలు

అమరావతి, జూన్ 22: ప్రజల నుంచి వచ్చే పీజీఆర్ఎస్ అర్జీలు, ఫిర్యాదులను మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని సీఎం పేర్కొన్నారు. అర్జీదారుల స్థానంలో తాము ఉన్నట్లు భావించి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తామని, వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తామని తెలిపారు.

క్షేత్రస్థాయి పర్యటనలతోనే వాస్తవ పరిస్థితుల అవగాహన

మంత్రులు, అధికారులు, ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని సీఎం అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పని విధానంలో మార్పులు అవసరమని, మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఫైళ్ల పరిష్కారం వేగవంతమైందని చెప్పారు.

తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి

కొన్ని రాజకీయ శక్తులు ప్రతి అంశాన్ని రాజకీయ రంగంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. సంఘటనలకు కుల, మత రంగులు పులుముతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను అరికట్టేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

పాత కేసుల పరిష్కారంపై ప్రస్తావన

2019లో జరిగిన కొన్ని నేరాలను ప్రస్తుతం గుర్తించి నిందితులను పట్టుకుంటున్నామని, శిక్షలు కూడా పడుతున్నాయని సీఎం తెలిపారు. తప్పు చేసిన వ్యక్తి ఎప్పటికీ తప్పించుకోలేడనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. అలాగే వాహనాల నెంబర్ ప్లేట్లు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

క్వాంటం పార్క్, సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు చర్యలు

డిసెంబర్ నాటికి క్వాంటం కంప్యూటర్ ప్రారంభించే లక్ష్యంతో పనిచేయాలని, అంతకుముందే క్వాంటం పార్క్, సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదుల కాలుష్య నియంత్రణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.