BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 09 May 2026, 02:57 pm
Posted by : యామనూరి మల్లికార్జున

మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 May, 2026 - 02:57 PM
163 వీక్షణలు

మే 11న  సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్  శ్రీశైలం లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులవ్వండి. చైర్మన్ రమేశనాయుడు, EO

కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం

 మే 11న  సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా మే 11వ తేదీన దేవస్థానంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు తెలియజేశారు. 

సోమనాథ ఆలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు మరియు దాని పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతప్రభుత్వ సాంస్కృతికశాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరున పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.  

ఇందులో భాగంగా రాష్ట్ర దేవదాయశాఖ ఉత్తర్వుల మేరకు మే 11వ తేదీన శ్రీశైలదేవస్థానంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. 

ఈసందర్భంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా వారు తెలియజేశారు.  ఇందులో భాగంగానే  మే 11 వ తేదీన ఉదయం గం. 7.00ల నుంచి గంగాధరమండపం వద్ద కలశయాత్ర ఉంటుందన్నారు.  గంగాధరమండపం ప్రారంభమయ్యే ఈ కలశయాత్ర నందిమండపం వరకు,  అక్కడి నుంచి మల్లికార్జునసదన్‌ మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వరకు మరియు అక్కడి నుంచి తిరిగి గంగాధర మండపం వరకు ఈ కలశయాత్ర నిర్వహించబడుతుందన్నారు. అనంతరం పంచాక్షరీ మంత్రలేఖనానికి భక్తులకు పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారు. 

తరువాత గంగాధర మండపం వద్ద గల ఏర్పాటు చేయనున్న వేదికపై గం. 10.00లకు ఎల్.ఈ.డి స్క్రీన్ నందు జాతీయ కార్యక్రమ ప్రదర్శన ఉంటుందన్నారు. 

కాగా సాయంకాలం గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేయనున్న వేదిక వద్దనే  గం.5.30ల నుంచి శివభజనలు, భక్తిరంజని కార్యక్రమాలు ఉంటాయన్నారు. తరువాత సాయంత్రం గం. 6.30లకు ఓంకారం ప్రాశస్త్యంపై ధార్మిక ప్రవచనం అనంతరం ఓంకార మంత్రజపం ఉంటుందన్నారు.  కార్యక్రమం అనంతరం రాత్రి గం. 7.30ల నుంచి పేరిణి శివతాండవం ప్రదర్శన ఉంటుందన్నారు.

కావున  భక్తులందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారివారు తెలియజేశారు. 


 ( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ