BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 30 April 2026, 10:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మే 1న గిరిప్రదక్షిణ మహోత్సవం… భక్తులకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:36 PM
143 వీక్షణలు

మే 1న గిరిప్రదక్షిణ మహోత్సవం… భక్తులకు ఆహ్వానం

దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మే 1వ తేదీ (శుక్రవారం) ఉదయం 7:00 గంటలకు గిరిప్రదక్షిణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నిబోయిన శ్రీనివాసులు, ఈఓ కృష్ణవేణి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

పవిత్రమైన ఈ గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు స్వామివారి అనుగ్రహం పొందే అపూర్వ అవకాశం లభిస్తుందని తెలిపారు. ఉదయం వేళలో ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించాలని సూచించారు.

మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సహకరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.