BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 May 2026, 03:15 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మే డే స్ఫూర్తితో బలమైన కార్మికోధ్యమాన్ని నిర్మిద్దాం!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 03:15 PM
154 వీక్షణలు

మే డే స్ఫూర్తితో బలమైన కార్మికోధ్యమాన్ని నిర్మిద్దాం!

మే డే సందర్భంగా సిపిఐ నేత డా. టి జనార్ధన్ పిలుపు...

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతి రేక విధానాలను ప్రతిఘటిస్తూ" మేడే" స్పూర్తితో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు  డాక్టర్ టి. జనార్ధన్ పేర్కొన్నారు. మేడే ని పురస్కరించుకొని పుంగనూరు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, హమాలి వర్కర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఆటో యూనియన్, భగత్ సింగ్ కాలనీలో సిపిఐ కార్యాలయం వద్ద ఎర్రజెండాలు ఎగరేశారు. ఈ సందర్భంగా కార్మికుల ఉద్దేశించి సిపిఐ నేత టీ. జనార్దన్ మాట్లాడుతూ కార్మికులు ఉద్యోగులు సుదీర్ఘ పోరాట ఫలితంగా సాధించుకున్న హక్కులు, చట్టాలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ కార్మిక వ్యతిరేక చర్యలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నారని చేయబడ్డారు. కార్మికులను సాధించుకున్న పలు చట్టాలను కుదించి వేయడం నిర్వీర్యం చేయడం, కార్మికులపై ఉక్కు పాదం మోపే చర్యలకు పాల్పడుతూ కార్పొరేట్లకు వంత పాడడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. ఇప్పటికే పని గంటలు మే డే స్ఫూర్తికి భిన్నంగా 8 నుండి 10 -12 గంటలకు పలు సంస్థలు పెంచుతున్నా  ప్రేక్షక పాత్ర వహించడం, ప్రభుత్వ చేతకాని తనానికి పరాకాష్టగా పేర్కొన్నారు. ఉద్యోగ, కార్మికులకు సక్రమంగా పిఆర్సి అమలు చేయకపోవడం, కరువు భత్యం చెల్లింపు విషయంలో కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఉద్యోగుల కనీస వేతనాల కోసం, కనీస వసతులు కల్పనకై, కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ ఐ వంటివి అందజేయడం, పుంగనూరు పట్టణంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం కోసం కార్మికులందరినీ ఏకతాటి మీద కలుపుకుని భవిష్యత్ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ కార్యదర్శి పివి రెడ్డి మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలిపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కె.రామ్మూర్తి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సి. శ్రీరాములు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మరియు సిపిఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి మూన్నా, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు నరేందర్ రెడ్డి, ఎస్ పి,బాబు రమణ, గౌరీ శంకర్, స్వామి శివారెడ్డి, హమాలీ వర్కర్స్ నేతలు వెంకటేష్,సూరి, రామనాథ , సుధాకర్,మునిస్వామి,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు ఆర్ శ్రీరాములు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోకుల్ సర్కిల్ వద్ద హమాలి యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు.