BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 01 May 2026, 09:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 09:38 PM
175 వీక్షణలు

మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట

“ప్రపంచ కార్మికులారా ఏకంకండి… పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప!” అనే నినాదాలతో మేడే ఉత్సాహం రాష్ట్రమంతా మార్మోగింది. ఏఐసిసిటియు ఆధ్వర్యంలో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి హరినాథ్ వెల్లడించారు.

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు రక్తం చిందించి సాధించిన ఎనిమిది గంటల పనిదినాన్ని ఇప్పుడు పాలకులు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం పనివేళలను 10 గంటలకు పెంచడం, మహిళలను రాత్రి పూట పనికి బలవంతం చేయడం వంటి చర్యలు పూర్తిగా కార్మిక వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కార్మికుల హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రయత్నాలు కొనసాగితే కార్మిక లోకం తిరగబడక తప్పదని హరినాథ్ హెచ్చరించారు. నోయిడాలో కార్మిక హక్కుల కోసం పోరాడిన 400 మంది కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా మేడేను విజయవంతం చేసిన కార్మికులకు హరినాథ్ అభినందనలు తెలియజేస్తూ, కార్మిక ఐక్యతతోనే హక్కులు సాధ్యమని పునరుద్ఘాటించారు.