BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 21 August 2026, 04:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మేయర్లు, ఛైర్మన్లకు ఇక ప్రజలే తీర్పు.....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 04:04 PM
57 వీక్షణలు

మేయర్లు, ఛైర్మన్లకు ఇక ప్రజలే తీర్పు.. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త విధానం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పట్టణ రాజకీయాల్లో కీలక మార్పుకు రంగం సిద్ధమైంది. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ మున్సిపల్ చట్టాల నాలుగో సవరణ బిల్లు-2026ను ఏకగ్రీవంగా ఆమోదించడంతో రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త విధానం అమల్లోకి రానుంది.

1986 నుంచి 2005 వరకు అమల్లో ఉన్న ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకొస్తోంది. గతంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పరోక్షంగా మేయర్, ఛైర్మన్లను ఎన్నుకునే విధానం ఉండగా.. ఇకపై ఓటర్లు తమ ఓటుతోనే మేయర్ లేదా ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.

పార్టీ గుర్తుపై ప్రత్యక్ష పోరు

కొత్త విధానం ప్రకారం ఓటర్లు ఒకే సమయంలో వార్డు సభ్యులు, కార్పొరేటర్లతో పాటు మేయర్, ఛైర్మన్ అభ్యర్థులకు కూడా పార్టీ గుర్తుపై ఓటు వేయనున్నారు. దీంతో పట్టణాల్లో రాజకీయ పోరు మరింత ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం ఉంది.

క్యాంప్ రాజకీయాలు, పదవుల కోసం జరిగే బేరసారాలకు అడ్డుకట్ట వేయడం, ప్రజల నేరుగా మద్దతు పొందిన నాయకత్వాన్ని తీసుకురావడం ఈ సంస్కరణ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.

100 పట్టణ సంస్థల్లో కొత్త విధానం

రాష్ట్రంలో ఇప్పటికే గడువు ముగిసిన 87 మున్సిపాలిటీలు, త్వరలో గడువు ముగియనున్న మరో 13 పట్టణ స్థానిక సంస్థలు కలిపి మొత్తం 100 పట్టణ సంస్థలకు ఈ విధానంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

కూటమికి రాజకీయంగా కీలక పరీక్ష

2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి జరగనున్న ఈ పట్టణ ఎన్నికలు అధికార కూటమికి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల స్పందనను తెలుసుకునే అవకాశంగా కూటమి భావిస్తోంది.

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది కీలక పరీక్ష కానుంది. పట్టణ ఓటు బ్యాంకు తమవైపు ఎంత మేరకు ఉందో నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు వేదికగా మారనున్నాయి.

పరిపాలనలో సవాళ్లు కూడా

ప్రత్యక్ష ఎన్నికల వల్ల మేయర్లు, ఛైర్మన్లకు ప్రజల నుంచి నేరుగా మద్దతు లభించినా.. కౌన్సిల్‌లో వేరే పార్టీకి మెజారిటీ వస్తే పరిపాలనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మేయర్, ఛైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు జరగడం వల్ల పట్టణ నాయకత్వం బలపడుతుందని, అదే సమయంలో సమన్వయంతో పాలన సాగించడం కొత్తగా ఎన్నికయ్యే నేతలకు ప్రధాన సవాలుగా మారనుంది.