BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 02 July 2026, 03:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన హెడ్‌మాస్టర్‌కు 5 ఏళ్ల జైలు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 03:35 PM
112 వీక్షణలు

కడప జిల్లా పులివెందులలో మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన కేసులో హెడ్‌మాస్టర్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

2019 డిసెంబర్ 2న పులివెందుల పట్టణంలోని రవీంద్రనాథ హైస్కూల్ (జెడ్పీహెచ్ స్కూల్)లో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న ఈ. కృష్ణ నాయక్ తన వద్ద చదువుతున్న 13 ఏళ్ల మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి, కొట్టి, అవమానకరంగా మాట్లాడినట్లు ఫిర్యాదు నమోదైంది.

ఫిర్యాదు అందుకున్న పులివెందుల పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, డిసెంబర్ 4న ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కేసును విచారించిన కడప పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి, ముద్దాయిపై ఆరోపణలు రుజువైనట్లు నిర్ధారించి ఐదు సంవత్సరాల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. వివిధ సెక్షన్ల కింద విధించిన శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో సాక్షులను సక్రమంగా కోర్టులో హాజరుపరచి, నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీరామ్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్, కోర్టు కానిస్టేబుల్ సి. సుబ్బయ్యలను కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.