BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 24 August 2026, 08:47 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Aug, 2026 - 08:47 PM
52 వీక్షణలు

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు...

అన్నమయ్య జిల్లా.

 మదనపల్లి.

అన్నమయ్య జిల్లా మదనపల్లె: మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయ తలుపులు మూసివేసి సిబ్బంది సమక్షంలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు, రికార్డులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అవకతవకలు, అనధికారిక నగదు లావాదేవీలు తదితర అంశాలపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయంలోని సిబ్బంది, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సంబంధిత రికార్డులను పరిశీలిస్తూ వివరాలను సేకరిస్తున్నారు.

తనిఖీలు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు లేదా ఇతర వివరాలపై అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలతో ఉత్కంఠ నెలకొంది.

 ఏసీబీ ఎస్పీ విజయలక్ష్మి ఆదేశాలతో డీఎస్పీ, సీఐల బృందం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో పది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారి వద్ద లభించిన సుమారు రూ.30 వేల నగదును సీజ్ చేశారని తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించాల్సి ఉంది.