BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 31 August 2026, 08:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మదనపల్లెలో పీజీఆర్‌ఎస్‌కు భారీ స్పందన..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:13 PM
52 వీక్షణలు

మదనపల్లెలో పీజీఆర్‌ఎస్‌కు భారీ స్పందన.. 316 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

గడువులోపు నాణ్యమైన పరిష్కారాలు అందించాలి.. అధికారులకు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలు

మదనపల్లె జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించే ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు.

పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఎలాంటి అర్జీలు పెండింగ్‌లో లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ సేవలపై నమ్మకం పెంపొందించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 316 అర్జీలు అందాయి. వీటిలో ప్రధానంగా అంగళ్లలో తాగునీటి సమస్య, రేషన్‌ షాప్‌ ఏర్పాటు, భూ వివాదాలు తదితర సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు. అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం కోసం ఎండార్స్ చేశారు.

ప్రజల నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చే అభిప్రాయాల్లో జిల్లా మెరుగైన స్థానంలో నిలిచేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖ అధికారి తమ శాఖ పనితీరును సమీక్షించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌తో పాటు రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందే అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు.