BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 07:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర డిపో ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ.. ప్రయాణికుడికి తిరిగి అందిన రూ.25 వేల విలువైన మొబైల్

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 07:13 PM
72 వీక్షణలు

మధిర, ఖమ్మం జిల్లా: నిజాయితీకి మారుపేరుగా నిలుస్తూ మధిర డిపో ఆర్టీసీ సిబ్బంది మరోసారి ప్రశంసలు అందుకున్నారు. బస్సులో మరిచిపోయిన విలువైన మొబైల్ ఫోన్‌ను గుర్తించి, ప్రయాణికుడికి సురక్షితంగా అప్పగించి తమ బాధ్యతను చాటుకున్నారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 2026 ఆగస్టు 30న మధిర డిపోకు చెందిన టీఎస్04యూఈ1394 ఎక్స్‌ప్రెస్ బస్సు మధిర నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఖమ్మం నుంచి ఎల్బీనగర్‌కు ప్రయాణించిన తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఇనపనూరి మధు, బస్సులో తాను కూర్చున్న సీటు వద్ద తన మొబైల్ ఫోన్‌ను మరిచిపోయి ఎల్బీనగర్ వద్ద దిగిపోయారు.

బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్‌కు చేరుకున్న తర్వాత తనిఖీ చేస్తున్న సమయంలో కండక్టర్ ఎస్కే నాగుల్ మీరా (ఈ.827064), డ్రైవర్ శ్రీకాంత్ బస్సులో మొబైల్ ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మొబైల్‌లోని నంబర్ల ఆధారంగా ప్రయాణికుడికి సమాచారం అందించారు.

హైదరాబాద్ బస్ స్టేషన్ మేనేజర్ సమక్షంలో రూ.25 వేల విలువైన పోకో మొబైల్ ఫోన్‌ను ప్రయాణికుడు ఇనపనూరి మధుకు తిరిగి అందజేశారు. పోగొట్టుకున్న మొబైల్‌ను తిరిగి అందించిన కండక్టర్, డ్రైవర్‌తో పాటు మధిర డిపో మేనేజర్ టీ. దేవరాజు, డిపో సిబ్బందికి ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్టీసీ సిబ్బంది చూపిన నిజాయితీపై ప్రయాణికులు, స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.