BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 04 August 2026, 03:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పెషల్ డ్రైవ్–2 అడ్మిషన్లు ప్రారంభం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 03:45 PM
60 వీక్షణలు

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పెషల్ డ్రైవ్–2 అడ్మిషన్లు ప్రారంభం

మధిర, ఆగస్టు 4: ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేస్–2 అడ్మిషన్ ప్రక్రియ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. రవీంద్రారెడ్డి వెల్లడించారు.

ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఆగస్టు 6 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గత దశల్లో వివిధ కారణాలతో దోస్త్‌లో నమోదు చేసుకోలేకపోయిన విద్యార్థులకు ఇది చివరి అవకాశం కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ దశలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. స్కాలర్‌షిప్ పొందాలనుకునే వారికి ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు.

కళాశాలలో బీకాం కోర్సులో కేవలం మూడు సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు. పీహెచ్‌డీ, సెట్, నెట్ అర్హతలు కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు:

ప్రిన్సిపాల్ డా. ఎం. రవీంద్రారెడ్డి – 9440257256

వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ – 9441786508

దోస్త్ సమన్వయకర్త డా. ఎస్. ఇందిర – 9553359879

డా. పి. సుజాత – 9177734879