మధిరలో పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర పట్టణంలోని రేణుకా చౌదరి క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు జవ్వాజి ఆనందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన మూడు చెక్కులను జవ్వాజి ఆనందరావు లబ్ధిదారులకు అందజేశారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సహకారంతో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసుతో ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు తెలిపారు.
చెక్కులు పొందిన వారిలో సిరిపురం గ్రామానికి చెందిన ఎదురు పద్మావతికి రూ.23,000, ఇల్లూరు గ్రామానికి చెందిన మడి వెంకన్నకు రూ.27,500, ఇల్లూరు గ్రామానికి చెందిన కొండల అర్చనకు రూ.16,000 చొప్పున చెక్కులు అందజేశారు. మొత్తం రూ.66,500 విలువైన మూడు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కార్లపూడి అప్పారావు, మధిర మండల నాయకులు అవ్వుల గురుబ్రహ్మం, జల్లేపల్లి ప్రసాద్, బాదా సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.