BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 26 April 2026, 11:57 am
Posted by : యామనూరి మల్లికార్జున

మహిళల భద్రతే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Apr, 2026 - 11:57 AM
130 వీక్షణలు

మహిళల భద్రతే లక్ష్యం

మహిళల భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యo.

నేరాల నివారణకు అవగాహన కార్యక్రమం 

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సి. బెలగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలపై జరుగుతున్న నేరాలపై శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి  మాట్లాడుతూ...

మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. 

మహిళలపై జరిగే అన్యాయాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేస్తోందని తెలిపారు. 

ఎవరైనా మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎంపీడీఓ ఎం. రాణెమ్మ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, మహిళలు తమ హక్కులు తెలుసుకుని ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.

సి.బెళగల్ ఎంఆర్ఓ వెంకట లక్ష్మి మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు వినియోగించుకోవాలని, సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులను సంప్రదించాలని తెలిపారు.

కోడుమూరు సీఐ తబ్రేజ్  మాట్లాడుతూ...

మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మహిళల భద్రతకు కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సి. బెలగల్ ఎస్సై వేణుగోపాల్ రాజు, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువత పాల్గొన్నారు. 

జిల్లా పోలీస్ కార్యాలయం, కర్నూలు