BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 23 July 2025, 06:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహిళా సాధికారత కోసం మహాలక్ష్మి పథకం

తెలంగాణ
23 Jul, 2025 - 06:49 AM
293 వీక్షణలు
మహిళా సాధికారత కోసం మహాలక్ష్మి పథకం-- శ్రీనివాస్ నాయుడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ NTODAY NEWS: యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళా సాధికారత సాధించుటకు సాయపడుతుందని యాదగిరిగుట్ట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ నాయుడు అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట డిపో లో జరిగిన మహాలక్ష్మి పథకం సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 9, 2023 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాల్లో ఒకటైన " మహాలక్ష్మి ( మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం) పథకం" ఈనాటికి రెండు వందల కోట్ల మహిళా ప్రయాణికులకు ఉపయోగపడిందని ఆయన అన్నారు.ఈ సంక్షేమ పథకాన్ని మహిళలు వినియోగించుకొని, సుమారు 6680 కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారని ఆయన అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. అలాగే ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పావని, యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ సి.ఎచ్ మురళీ కృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్, గ్యారేజ్ ఇంచార్జీ హనుమా నాయక్, ఆర్టీసీ సిబ్బంది ముత్యాలు, మనోజ్ కుమార్, ఆర్టీసీ ఉద్యోగులు, మరియు యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube