BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 14 July 2026, 08:12 pm
Posted by : కూనురు మధు

రోడ్డు విస్తరణ పనులపై స్పష్టత ఇవ్వాలని బిఆర్ఎస్ వినతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
14 Jul, 2026 - 08:12 PM
228 వీక్షణలు

రోడ్డు విస్తరణ పనులపై స్పష్టత ఇవ్వాలని బిఆర్ఎస్ వినతి

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భువనగిరి రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో స్థానిక ప్రజల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించాలని కోరుతూ మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ చిట్యాల - భువనగిరి రోడ్డు విస్తరణ పనులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నవని, అయితే ఈ రోడ్డు నిర్మాణాన్ని అసలు ఎన్ని ఫీట్ల వెడల్పుతో చేపట్టబోతున్నారనే విషయంపై స్థానిక ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పరిధిలోకి వచ్చే ఇళ్లు, వ్యాపార సముదాయాల యజమానులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని మున్సిపల్ యంత్రాంగం అధికారికంగా ప్రకటించి, చిట్యాల ప్రజల అయోమయాన్ని త్వరగా నివృత్తి చేయాలని కమిషనర్‌ను కోరారు. భువనగిరి రోడ్డు విస్తరణకు సంబంధించి ఎన్ని ఫీట్ల వెడల్పుతో పనులు ప్రారంభమవుతాయో అధికారికంగా వెల్లడిస్తే ప్రజలకు, వ్యాపారులకు ఒక స్పష్టత వస్తుంది అని. అధికారులు వెంటనే స్పందించి ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి కోరారు.

​కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, స్థానిక కౌన్సిలర్లు నిమ్మనగొట్టి శ్రీనివాస్ , ఎస్.కె. షబానా అజీముద్దీన్  నాయకులు,  ​జిట్ట బొందయ్య ,​బొబ్బల శివశంకర్ రెడ్డి, ​కందాటి రమేష్ రెడ్డి, ​రుద్రారపు కృష్ణ, ​ఆగు అశోక్, ​మారగోని రమేష్, ​బొలుగురి సైదులు, ​ఆవుల ఆనంద్,బి​జిట్టా కృష్ణ, ​ఉప్పలపల్లి నగేష్

​జిట్టా శేఖర్, ​కునూరు శంకర్, ​చేపూరి శ్రీనివాస్

​సుంచు సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు.