BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 10:25 pm
Posted by : కూనురు మధు

​మిర్యాలగూడలో పోలీసుల తనిఖీలు 38 వాహనాలు సీజ్

తెలంగాణ
/ నల్గొండ / మిర్యాలగూడ
15 Jul, 2026 - 10:25 PM
95 వీక్షణలు

​​మిర్యాలగూడలో పోలీసుల తనిఖీలు : 38 వాహనాలు సీజ్ !     

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నేరాల నియంత్రణే ధ్యేయంగా పోలీసులు బుధవారం తెల్లవారుజామున విస్తృత తనిఖీలు చేపట్టారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్,  ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఆకస్మిక సోదాల్లో సరైన పత్రాలు లేని 38 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వన్ టౌన్ సీఐ నాగభూషణ్, టూ టౌన్ సీఐ సోమ నర్సయ్య, రూరల్ సీఐ పి.ఎన్.డి ప్రసాద్ నేతృత్వంలో 8 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారి మార్గాలు, ప్రవేశ-నిష్క్రమణ ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో ఏకకాలంలో నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ​వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సోదాల్లో

​నంబర్ ప్లేట్లు లేనివి: 11 ద్విచక్ర వాహనాలు

​సరైన పత్రాలు లేనివి: 27 వాహనాలు మొత్తం 38 వాహనాలను సీజ్ చేశారు  ​నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


* నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : డీఎస్పీ రవి


మిర్యాలగూడ పట్టణంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు., నేరాల నియంత్రణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి అని. వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల పత్రాలను కలిగి ఉండాలి అని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, తమ పరిధిలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా గుర్తుతెలియని వ్యక్తులు  తిరుగుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. రాత్రి వేళల్లో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న అనుమానితుల వివరాలను సేకరించడంతో పాటు, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.