BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 06 July 2025, 06:31 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జులై 10న జరిగే మెగా పేరెంట్స్ డే ను విజయవంతం చేయండి

తెలంగాణ
06 Jul, 2025 - 06:31 AM
314 వీక్షణలు
జులై 10న జరిగే మెగా పేరెంట్స్ డే నువిజయవంతం చేయండి- మండల విద్యాశాఖాధికారి వి యస్ వి బ్రహ్మాచారి   NTODAY NEWS చాట్రాయి జులై-6 (ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) చాట్రాయి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్, యాజమాన్యాలలోని పాఠశాలు, జూనియర్ కళాశాలలన్నింటిలో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని చాట్రాయి మండల విద్యాశాఖాదికారి వి.యస్.వి బ్రహ్మా చారి ఒక ప్రకటనలో ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పరస్పర సమన్వయంతో విద్య, ప్రవర్తన, సామాజిక అవగాహన పరంగా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది ఉత్తమ మానవ వనరులను దేశానికి అందించే లక్ష్యంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. మండలంలోని 62 ప్రభుత్వ, 6 ప్రైవేట్ పాఠశాలలు 1 ప్రైవేట్ జూనియర్ కళాశాల వెరసి మొత్తం 69 పాఠశాలన్నింటిలో చదుపుతున్న 4410 మంది విద్యార్థులు వారితల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో ఈ మెగా పిటియం-2.0 కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, ప్రణాళికలను అన్ని పాఠశాలలు, కళాశాలల్లో నాలుగు రోజులు ముందుగానే సమాయత్తం చేయాలని ఎస్ఎంసి, పేరెంట్- టీచర్ అసోసియేషన్లకు ఆయన సూచించారు. కార్యక్రమాల నిర్వహణకు అంశాల వారిగా ఆహ్వానం, బడ్జెట్, కోనుగోళ్లు, పాఠశాల పరిశుభ్రత, సుందరీకరణ, పర్యావణ భద్రత, రెసెప్షన్, సిట్టింగ్ ఏర్పాట్లు, ప్రగతి నివేదిక తయారీ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు, ఆహారం, తాగునీరు, క్రమశిక్షణ, పార్కింగ్, వైద్య సహాయం, గ్రీస్ పాస్ పోర్టు, డాక్యుమెంటేషన్, ఫొటో, వీడియో కవరేజి, తల్లికి వందనం, మీడియా కవరేజిల కొరకు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఈ కార్యక్రమoలో తప్పక పాల్గొనేలా ఆహ్వానించి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందించాలన్నారు. విద్యార్థుల హెల్త్ కార్డులను తల్లిదండ్రులకు చూపి, వారి పోషణ, ఆరోగ్య రక్షణ గురించి వారితో చర్చించాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల దుష్ప్రభావలు వివరించి, వాటి నుండి విద్యార్థులను దూరంగా ఉంచడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయల పాత్రలను తెలియజేయాలన్నారు. మెగా పిటియం 2.0 కార్యక్రమాలకు హాజరయ్యే తల్లుల కొరకు ముగ్గులు పోటీలు, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ వంటి క్రీడలు, తండ్రులకు టగ్-ఆఫ్-వార్ పోటీలు నిర్వహించాలని సూచించారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. Follow us on Website Facebook Instagram YouTube