మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!
జాతీయం
విజయవాడ: బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గురువారం మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,42,550కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,55,510 వద్ద కొనసాగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. మరోవైపు వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రూ.2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.